హైదరాబాద్: బీజేపీ మాజీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఇతరుల ఖాతాలకు నిధులు బదిలీ చేశారన్న ఆరోపణలపై నోటీసులు జారీ చేసింది.
టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ సోమ భరత్‌కుమార్ ఫిర్యాదు మేరకు సుషీ ఇన్‌ఫ్రా కంపెనీ రూ.5.24 కోట్ల లావాదేవీలపై స్పందించిన ఈసీ రాజగోపాల్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 4 గంటలలోగా వివరణ ఇవ్వాలని, లేదంటే తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
14, 18, 29 తేదీల్లో మునుగోడులోని పలువురు వ్యక్తులు, సంస్థలకు చెందిన 23 ఖాతాలకు సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ నుంచి నిధులు బదిలీ అయ్యాయని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ సోమ భరత్ శనివారం ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల.