Vemulavada | వేములవాడ(Vemulavada) రాజన్న ఆలయానికి(Rajanna temple) భక్తులు(Devotees) శుక్రవారం పోటెత్తారు.
రాజన్న సిరిసిల్ల : వేములవాడ(Vemulavada) రాజన్న ఆలయానికి(Rajanna temple) భక్తులు(Devotees) శుక్రవారం పోటెత్తారు. మేడారం(Medaram) జాతర సమీపిస్తున్నందున సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాముననే భక్తులు పవిత్ర ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడె మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు.
స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో గంటతరబడి నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. కోడె మొక్కుకోసం భక్తులు క్యూ లైన్లో దాదాపు 2 గంటలపాటు నిలబడి మొక్కు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు జాతరను తలపించాయి. అధికారులు భక్తులకు ఇబ్బం దులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మద్యాన్నం 12.30 గంటలవరకు రాజన్నను సుమారు 35వేలకు పైగా దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.
