
రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. టెక్స్‌టైల్ పార్క్‌లోని పౌరసంబంధాల మంత్రిత్వ శాఖ గోదాములో మంటలు చెలరేగాయి. ఈ గోదాములో రేషన్ బియ్యాన్ని నిల్వ చేస్తారు. గోదాము సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. రెండు అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని గోదాం సిబ్బంది తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
812056