
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో ఆర్టీసీ బస్సు గందరగోళం సృష్టించింది. హైదర్ షాకోట్ సమీపంలో బస్సు రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది.
ఘటన జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మంది తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.
బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులు బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు వేర్వేరు వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
