ఇన్నాళ్లూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ సారి లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్న ఆమె తొలిసారిగా పెద్దల సభకు ప్రాతినిథ్యం వహించబోతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ(గురువారం) రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఉదయం సోనియాతో రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సోనియా పోటీ చేశారు. నిన్నటి(బుధవారం)తో మన్మోహన్ పదవీకాలం ముగిసింది. రాజస్థాన్ నుంచి సోనియా పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో గురువారం సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. సోనియాతో పాటు రాజ్యసభకు ఎన్నికైన 12మంది ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో వాహన తనిఖీలో పట్టుబడ్డ నకిలీ నోట్లు