Ranchi test: రూట్, రాబిన్‌సన్ భాగస్వామ్యానికి జడేజా బ్రేక్ వేశాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసుకున్నాడు జడ్డూ. ప్రస్తుతం ఇండ్లండ్ 9 వికెట్ల నష్టానికి 352 రన్స్ చేసింది. రాబిన్‌సన్ హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. రూట్ 120 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు.
రాంచీ: రాంచీ టెస్టు(Ranchi Test) తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ రాబిన్‌సన్ హాఫ్ సెంచరీ చేశాడు. తొమ్మిదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రాబిన్‌సన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జడేజా బౌలింగ్‌లో స్వీప్ షాట్ కొట్టిన రాబిన్‌సన్ టెస్టుల్లో తొలిసారి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వ్యక్తిగతంగా 58 పరుగుల వద్ద రివర్స్ స్వీప్ షాట్ ఆడిన రాబిన్‌సన్.. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 9 వికెట్ల నష్టానికి 349 రన్స్ చేసింది. జో రూట్, రాబిన్‌సన్ మధ్య 8 వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. రాబిన్‌సన్ ఔటైన ఓవర్‌లోనే బాషర్ కూడా ఔటయ్యాడు. ఇవాళ జడేజా ఆ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 120 రన్స్‌తో రూట్ ఇంకా క్రీజ్‌లో ఉన్నాడు.
A double-wicket over, courtesy Ravindra Jadeja 👏👏
England 9 down.
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #TeamIndia | #INDvENG | @imjadeja | @IDFCFIRSTBank pic.twitter.com/1Jlu3igpaY
— BCCI (@BCCI) February 24, 2024
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు.. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 302 పరుగులు చేసింది. గత మూడు టెస్టుల్లో మూడు సార్లు బుమ్రా బౌలింగ్‌లో ఔటైన రూట్.. జస్ప్రీత్ గైర్హాజరీని పూర్తిగా సద్వినియోగ పరుచుకున్నాడు. జాక్ క్రాలీ (42; 6 ఫోర్లు, ఒక సిక్సర్), బెయిర్ స్టో (38), బెన్ ఫోక్స్ (47) పర్వాలేదనిపించారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (3), ఒలీ పోప్ (0), డకెట్ (11) విఫలమయ్యారు.
