ఎండలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిజామాబాద్, ఖమ్మం, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు కురుస్తాయంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, జగితాల్య, రాజన్న సిరిసిల్ల, కీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో రాత్రిళ్లు వేడిగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. రేపు(ఆదివారం) ఖమ్మం, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ వేడి, తేమతో కూడిన పరిస్థితులుంటాయని చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో రాత్రిపూట వేడిగా ఉంటుందని చెప్పింది. దీనికి సంబంధించి ఆయా జిల్లాల్లకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ తీరుతో తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం
The post రాబోయే రెండురోజులు రాష్ట్రంలో వానలు కురిసే అవకాశం appeared first on tnewstelugu.com.