Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

రాశి ఫలాలు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 13, 2024No Comments

Weekly Horoscope | అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సమయోచిత నిర్ణయాలతో అన్నిటా విజయం సాధిస్తారు. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు.

January 14, 2024 / 01:52 AM IST
రాశి ఫలాలు

Weekly Horoscope | రాశిఫలాలు ( 014.01.2024 నుంచి 20.01.2024 వరకు )

Horoscope |మేషం

కొత్త పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులకు కాలం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణకు మంచి సమయం. విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం అవకాశాలు రావొచ్చు. ఆర్థికంగా మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

వృషభం

రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి కాలం. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అండదండలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రయాణాల ద్వారా లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. భూ లావాదేవీలు కలిసివస్తాయి. శివాలయాన్ని సందర్శిస్తే మంచిది.

మిథునం

చేపట్టిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. ప్రతికూల పరిస్థితులు క్రమంగా తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. వారం మధ్యలో ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. వ్యాపార ఒప్పందాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. వినాయకుడి ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం

దూర ప్రయాణాలు కలిసివస్తాయి. పనులపై మనసు నిలపడం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు మంచికాలం. అదృష్టం కలిసివస్తుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.

సింహం

బంధుమిత్రులను కలుస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పైస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంది. ఆర్థికంగా కలిసివస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో ముందుకుసాగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.

కన్య

కుటుంబ పెద్దల సహకారం పొందుతారు. తీర్థయాత్రలకు వెళ్లవచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అనుభవజ్ఞుల సహకారంతో పనులు చేస్తారు. సత్ఫలితాలను పొందుతారు. ప్రభుత్వ పనులలో కాలయాపన జరుగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా రావచ్చు. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

తుల

ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉంటారు. పదో న్నతి, అనుకూల బదిలీ ఉండవచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి పేరు సంపాదిస్తారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. పారిశ్రామికవేత్తలకు న్యాయ సమస్యలు దూరమవుతాయి. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చికం

పాతబాకీలు వసూలవుతాయి. ప్రారంభించిన పనులు శ్రద్ధతో పూర్తిచేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధువులతో కార్య సాఫల్యం ఉంది. ఉద్యోగులకు అనుకూల వారం. అధికారుల అండదండలు లభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాల్సి రావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. శివాలయాన్ని సందర్శించండి.

ధనుస్సు

ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారం నిరాటంకంగా సాగుతుంది. రావలసిన సొమ్ము ఆలస్యంగా అందడంతో కొన్ని పనులు వాయిదా పడతాయి. శ్రమతో లక్ష్యాలు పూర్తవుతాయి. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూ లావాదేవీలు కలిసివస్తాయి. శుభకార్య ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

మకరం

శుభకార్య యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారు శుభవార్త వింటారు. సంతృప్తిగా ఉంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. పదోన్నతి, బదిలీలు ఉండవచ్చు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పూర్వం పెట్టిన పెట్టుబడులకు ఫలితాలను పొందుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. కళాకారులకు అనుకూలం. దక్షిణామూర్తి ఆరాధన శుభప్రదం.

కుంభం

ఉత్సాహంగా పనులు చేస్తారు. బరువు, బాధ్యతలు పెరిగినా సంతృప్తిగా ఉంటారు. వ్యాపారులకు ఒప్పందాలు అనుకూలిస్తాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయంపై మనసు నిలుపుతారు. వాహనం వల్ల పనులు నెరవేరుతాయి. అయితే వృథా ఖర్చులతో ఇబ్బందులు రావచ్చు. సంయమనంతో ముందుకు వెళ్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఇష్టదేవతార్చన మేలు చేస్తుంది.

మీనం

ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉన్నా జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సాహితీవేత్తలకు, కళాకారులకు అనుకూలం. రాజకీయ పనులలో పురోగతి ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభ
దాయకంగా కొనసాగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వారాంతంలో శుభవార్త వింటారు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి

ఎం.ఎస్సీ., నిర్మల్‌ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌. సెల్‌: 9885096295
ఈ మెయిల్‌ : nirmalsiddhanthi@yahoo.co.in

Previous article

సంజీవని కాదు.. విషం!

Next article

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.