తెలంగాణ పోలీసు శాఖలో కూడా బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా డీఎస్పీలు, ఏఎస్పీలను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 12 మంది అడిషనల్ ఎస్పీలకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా ఇవాళ(శనివారం) ఉత్తర్వులు జారీ చేశారు.
నిజామాబాద్ అడిషనల్ డీసీపీగా ఎస్ రమేశ్, ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీగా సురేందర్ రావు, హైదరాబాద్ ట్రాఫిక్-3 అడిషనల్ డీసీపీగా రామారావు, సైబరాబాద్ క్రైమ్ అడిషనల్ డీసీపీగా శ్రీనివాసులు, మెదక్ అడిషనల్ ఎస్పీగా రెహ్మాన్, నిర్మల్ అడిషనల్ ఎస్పీగా శివకుమార్ నియమితులయ్యారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ జన్మదినం.. వెయ్యి మంది ఆటో డ్రైవర్‌లకు ప్రమాద బీమా పత్రాలు అందజేసిన కేటీఆర్
The post రాష్ట్రంలో 12 మంది అడిషనల్ ఎస్పీలకు స్థానచలనం appeared first on tnewstelugu.com.
