
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. యాదాద్రీశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం యాదాద్రికి వచ్చిన రాష్ట్రపతికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. ఆలయంలో అర్చకులు, అధికారులు ఆయనకు ఘనంగా సత్కరించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గర్భాలయంలోని స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రాష్టప్రతికి ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను ప్రతిష్ఠించారు.

అనంతరం యాదాద్రి ప్రధాన ఆలయ పరిసర ప్రాంతాలను రాష్ట్రపతి పరిశీలించారు. అద్దాల బూత్‌ను, ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ జనరల్ తమిళిసై సందరరాజన్ ఉన్నారు. యాదగిరిగుట్టను సందర్శించిన ఐదవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం గమనార్హం.
