సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన “డీజే టిల్లు” చిత్రానికి సీక్వెల్‌ను ప్రకటించాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. దీనికి “టిల్లు స్కేర్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ప్రకటన సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సీక్వెల్ రెట్టింపు వినోదాన్ని అందించనుందని వీడియో చూపిస్తుంది.
ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మాలిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్, సంగీతం: రామ్ మిరియాల.