
ఈ నెల 6న తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడసేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ప్రతి నెల పౌర్ణమి రోజున శ్రీవారికి గరుడసేవ నిర్వహిస్తారు. కానీ ఈ మాసంలో మాత్రమే ఆలయంలో అధ్యయనోత్సవం జరుగుతుంది. అందుకే పౌర్ణమి గరుడ సేవను రద్దు చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఆలయ అధికారులు కోరారు.
