
రేపు (సోమవారం) ఉదయం భద్రాద్రిలో ఉత్తర ద్వారం నుంచి భక్తులకు సీతారాములు, లక్ష్మణ దర్శనం కల్పించనున్నారు. సోమవారం తెల్లవారుజామున 12:00 నుంచి 1:00 గంటల వరకు ఆలయ అధికారులు సుప్రభాత సేవ, ఆరాధన ఏకాంత సేవ నిర్వహిస్తారు. తిరుమంజనం ఉదయం 1 గంటల నుంచి 2.30 గంటల వరకు భక్తులకు ప్రత్యేక పుణ్యస్నానం. తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు స్వామివార్లకు అలంకారాలు, బాల భోగం నివేదన, తిరుప్పావై సేవా కళ్యాణం జరుగుతాయి. అనంతరం 3.45 గంటలకు భక్తులకు మూలవర దర్శనం ఉంటుంది.
ఉదయం 5 గంటలకు ఉత్సవమూర్తులను వైకుంఠ ద్వారం దగ్గరకు తీసుకొచ్చారు… 4:40 నుంచి 5 గంటల వరకు ద్వార దర్శన ప్రాసత్యం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీ వైకుంఠ ద్వారం తెరిచి, మంగళ వాయిద్యాలు, 6 గంటల నుంచి స్వామివారికి వివిధ పూజలు నిర్వహించి ఉత్తర ద్వారం నుంచి స్వామి తిరువీధి సేవకు వెళ్లనున్నారు.
