- దేశంలో అడుగడుగునా మోదీ అభివృద్ధి కనిపిస్తున్నది
- కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అమలైనవి ఎన్ని?
- భూములు కబ్జా చేసే వ్యక్తికి టికెటిచ్చారు
- మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు
తూప్రాన్, ఏప్రిల్ 15: డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైంది రేవంత్‌రెడ్డి అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేరలేదన్నారు. సోమవారం తూప్రాన్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పెట్టి, ఆటోడ్రైవర్ల పొట్టకొట్టిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. రూ.2 వేలు ఉన్న పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతా అన్న చిన్న కొడుకు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారన్నారు. మహాలక్ష్మిల్లాగా చూస్తానని నెలకు రూ.2500లు ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైందని మహిళలను ప్రశ్నించారు. రాష్ట్రంలో నీళ్లకు కొరత ఉందేమోగానీ, మద్యానికి కొరత లేదన్నారు.
భూముల్ని దొంగతనంగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలిసిన వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చారని, ఏం చదువుకున్నాడో తెలియని వ్యక్తి రేపు గెలిస్తే పార్లమెంటులో ఏం మాట్లాడుతాడని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు భూమన్నగారి జానకీరామ్‌గౌడ్, నాయకులు మధుసూదన్‌రెడ్డి, జంగంపేట సాయిబాబాగౌడ్, జమాల్‌పూర్ నర్సోజీ, వర్గంటి రామ్మోహన్‌గౌడ్, శివ్వమ్మ, అంజాగౌడ్, మహేశ్‌గౌడ్, తాటి విఠల్, గడ్డం రవీందర్, నత్తి మల్లేశ్, సిద్ధిరాములు యాదవ్, చంద్రశేఖర్, పిట్ల పోచయ్య, కార్తిక్‌గౌడ్ పాల్గొన్నారు.
బీజేపీ ఇంటింటి ప్రచారం
అల్లాదుర్గం, ఏప్రిల్ 15: మండలంలోని చేవెళ్ల, అల్లాదుర్గంలో జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు మద్దతుగా ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు బ్రహ్మం, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాములు, మండల అధ్యక్షుడు యాదగిరి, సాయిలుగౌడ్ తదితరులు ఉన్నారు.