తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు.. తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదన్నారు. తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం మన ఖర్మ అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెలవనోడు సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యం అని విమర్శించారు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదని తేల్చి చెప్పారు.
ప్రధాని మోడీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ దాడి చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్‌కు, గోల్డెన్ తెలంగాణ మోడల్‌తో పోలికెక్కడిది..? అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఘనమైన “గంగా జెమునా తెహజీబ్ మోడల్” కన్నా..మతం పేరిట చిచ్చు పెట్టే “గోద్రా అల్లర్ల మోడల్” నీకు నచ్చిందా..? అని నిలదీశారు. నిన్న మొన్నటి దాకా గుజరాత్ మోడల్‌పై నిప్పులు చెరిగిన రేవంత్.. ఇవాళ ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే.. ఆయన గురించి గొప్పలు మాట్లాడుతున్నారు. ఇదేం నీతి.. ఇదేం రీతి.. రేవంత్ అంటూ కేటీఆర్ విమర్శించారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు
దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించ పరుస్తావా..? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన? నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడేమో.. తెలంగాణ “ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్..” నేడేమో “తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్..” నిన్ను చరిత్ర క్షమించదు అని రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ కు తెలంగాణ “ఆత్మ”లేదు.
తెలంగాణపై “గౌరవం” అంతకన్నా లేదు.అందుకే తెలంగాణ “ఆత్మగౌరవం”పై
మోడీ సాక్షిగా… రేవంత్ దాడిఅసలు తెలంగాణ సోయి లేనోడు..
సీఎం కావడం మన ఖర్మ..
తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు
ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యంఅసలు “గోల్ మాల్ గుజరాత్ మోడల్”…
— KTR (@KTRBRS) March 6, 2024
