ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వారం రోజులుగా ఎండిన పంటపోలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి దీనికి సంబంధించిన నివేదికను అధినేతకు అందజేశారు. దీంతో స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు భరోసా కల్పించేందుకు కేసీఆర్ కదలి రానున్నారు.
రేపు(ఆదివారం) కేసీఆర్ ఉదయం 9 గంటలకు బయలుదేరి వయా భువనగిరి మీదుగా జనగామ వెళ్తారు. మొదట దేవరుప్పుల లో ఎండిన పంటలను పరిశీలిస్తా. తర్వాత సూర్యాపేట జిల్లా లోని అర్వపల్లి ,తుంగతుర్తి మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత సూర్యాపేట పట్టణంలో ని జనగామ రోడ్ లో పంటలను పరిశీలిస్తారు. సూర్యాపేట లో ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అక్కడి నుండి హాలియ మిర్యాలగూడ రోడ్ పక్కన ఉన్న సాగర్ ఆయకట్టు లో ఎండిన పొలాలను పరిశీలించి హైదరాబాద్ వెళ్తారు.
నల్గొండ జిల్లా తర్వాత వరంగల్ ,మెదక్, రంగారెడ్డి జిల్లాలోనూ కేసీఆర్ పర్యటించనున్నారు. క్షేత్ర స్థాయిలో రైతుల కష్టాలను చూసి, వారిలో ధైర్యాన్ని నింపనున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు నిర్లక్ష్యాన్నికి గురవుతున్న తీరును ఎండగట్టనున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: దానం నాగేందర్ ను వెంటనే అనర్హుడిగా ప్రకటించాలి
The post రైతన్నలకు కేసీఆర్ భరోసా..! రేపటి నుంచి పల్లె పల్లెకూ గులాబీ బాస్ appeared first on tnewstelugu.com.