మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ముంబై-గోవా జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు రాయ్‌గఢ్ జిల్లా రెపోలిలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఫలితంగా తొమ్మిది మంది చనిపోయారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. కారు గుహఘర్కు వెళుతుండగా ట్రక్కు ముంబై వైపు వెళ్తోందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఓ చిన్నారి సహా ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ట్రక్కును కారు ఢీకొట్టడం గురించిన పోస్ట్. The post తొమ్మిది మంది మృతి appeared first on T News Telugu
