రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. లాలూకి కిడ్నీ మార్పిడి అనివార్యం కావడంతో…ఆయన కూతురు రోహిణి ఆచార్య(40) తన కిడ్నీని తండ్రికి దానం చేసింది. డిసెంబర్ 5న సింగపూర్ ఆసుపత్రిలో వైద్యులు రోహిణి కిడ్నీని లాలూకు అమర్చేందుకు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం లాలూ ఆరోగ్యంగానే ఉన్నారు. లాలూ ఆరోగ్యంపై రోహిణి ఆచార్య ఈరోజు (గురువారం) ట్వీట్ చేశారు. ‘నేను బాగున్నాను. నాన్న కూడా బాగానే ఉన్నారు. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ ప్రార్థనలు నాకు గొప్ప శక్తిని ఇస్తున్నాయి. మీపై నాకు చాలా ప్రేమ మరియు గౌరవం ఉన్నాయి. నేను మీకు మాటల్లో కృతజ్ఞతలు చెప్పలేను’ అని ఆమె ట్వీట్ చేసింది.
నేను ఇప్పుడు గొప్పగా భావిస్తున్నాను. నాన్న కూడా బాగానే ఉన్నారు. చెప్పటానికి ఏమిలేదు.
మీ ప్రార్థనలన్నీ ఫలించాయి. నా హృదయం నుండి, మీ అందరి పట్ల నాకు చాలా ప్రేమ మరియు గౌరవం ఉన్నాయి.
మీ ప్రార్థనలు నాకు గొప్ప శక్తిని ఇస్తున్నాయి. నేను చెప్పడానికి ఏమీ లేదు, అందరికీ ధన్యవాదాలు. pic.twitter.com/Ijk5rCOTnu
— రోహిణి ఆచార్య (@RohiniAcharya2) డిసెంబర్ 8, 2022
