కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు ఆమె అభిమానులు, కుటుంబసభ్యులు. లాస్య నందిత మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన లాస్య నందితను..అంతకు ముందు కూడా ప్రమాదాలు వెంటాడాయి. గత ప్రమాదాల నుంచి తప్పించుకున్న లాస్య..రోడ్డు ప్రమాదంలో ఆమెను కబలించింది.
లిఫ్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి బయటపడింది లాస్య. తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వెళ్లి వస్తుండగా ఫిబ్రవరి 13వ తేదీన రెండవసారి ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో లాస్య కారు ఢీకొనడంతో హోంగార్డు మరణించాడు. త్రుటిలో ఈ ప్రమాదం నుంచి లాస్య తప్పించుకుంది. వారం కూడా గడవక ముందే మూడవ సారి ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదం ఆమెను గండంలో నుంచి గట్టెక్కించలేకపోయింది. ఈ ప్రమాదంలో లాస్య అక్కడిక్కడే మరణించింది. రెండోసారి స్కార్పియో వాహనం ప్రమాదానికి గురైనప్పుడు ఉన్న డ్రైవరే ఇప్పుడు కూడా ఉన్నాడని..డ్రైవర్ ను మార్చితే లాస్య బతికేదేమోనని అంటున్నారు.
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ యువఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి 3 కారణాలివే..!
