దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఇవాళ( ఆదివారం) ఉదయం కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్లిన కేటీఆర్.. లాస్య తల్లి, సోదరిని ఓదార్చారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన.. లాస్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురి అయ్యాను. ఆరోజు నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయాను. లాస్య నందితను గత 10,15 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయి. గతేడాది వారి నాన్నఎమ్మెల్యే సాయన్న చనిపోయారు. ఇప్పుడు ఈమె చనిపోవటం బాధాకరం. లాస్య నందిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. అంతేకాదు..కంటోన్మెంట్ బీఆర్ఎస్ కార్యకర్తలకు,వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు కేటీఆర్.
ఇది కూడా చదవండి: మరోసారి పంజా విసురుతోన్న కోవిడ్..ఒక్కరోజే ఏడుగురికి పాజిటివ్.!
