తెలంగాణ రాష్ట్ర శాసన మండలి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్ గ్రౌండ్స్‌లో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్లమెంట్ గ్రౌండ్స్‌లో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, బోగారపు దయానంద్, దండే విఠల్, నవీన్‌కుమార్, రఘోత్తంరెడ్డి, శాసనమండలి కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, బీఆర్‌ఎస్ ఎల్‌పీ కార్యదర్శి రమేష్‌రెడ్డి, గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
