వినియోగదారుల ధరల సూచీని ప్రకటిస్తూ కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పారిశ్రామిక కార్మికుల సీపీఐ 1659 నుంచి 1733కి (74 పాయింట్లు), వ్యవసాయ కార్మికులకు 1260 నుంచి 1302కి (42 పాయింట్లు పెరిగింది) పెరిగింది.

హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): వినియోగదారుల ధరల సూచీని ప్రకటిస్తూ లేబర్ కమిషనర్ అహ్మద్ నదీమ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
పారిశ్రామిక కార్మికుల సీపీఐ 1659 నుంచి 1733కి (74 పాయింట్లు), వ్యవసాయ కార్మికులకు 1260 నుంచి 1302కి (42 పాయింట్లు పెరిగింది) పెరిగింది. పెంపుదల ఈనెల 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు వర్తిస్తుందని, ఆ సమయంలోనే కరువు భత్యాన్ని నిర్ణయించాలన్నారు. 1948 కనీస వేతన చట్టం ప్రకారం, కార్మిక శాఖ ప్రతి ఆరు నెలలకు ధర సూచికను ప్రచురిస్తుంది.
