లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీఆర్‌ఎస్ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసింది. బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పట్టున్న వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్‌లో విజయం కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. ప్రచార ప్రక్రియ నిర్వహణకు అనుగుణంగా సంస్థాగతంగా ఏర్పాట్లు చేస్తున్నది.
- వరంగల్ సెగ్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం
- ప్రకటించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
వరంగల్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీఆర్‌ఎస్ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసింది. బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పట్టున్న వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్‌లో విజయం కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. ప్రచార ప్రక్రియ నిర్వహణకు అనుగుణంగా సంస్థాగతంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు సమన్వయకర్తలను నియమిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్ ఇన్‌చార్జీలు ఉన్నారు. వీరికి, బీఆర్‌ఎస్ క్యాడర్‌కు సమన్వయం చేసేందుకు వీలుగా ప్రతి సెగ్మెంట్‌లో సమన్వయకర్తలు పనిచేస్తారు. బీఆర్‌ఎస్‌లోని ముఖ్యనేతలు పలువురికి ఈ బాధ్యతలు అప్పగించారు. బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి లేని వర్ధన్నపేట నియోజకవర్గంలో ఈ బాధ్యతలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ నిర్వహిస్తారు. ఈ సెగ్మెంట్‌లోని ఆరు మండలాల్లో మూడు మండలాల చొప్పున వీరు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.
అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు
పరకాల: ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్
పాలకుర్తి : ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్
భూపాలపల్లి : ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
స్టేషన్ ఘన్‌పూర్: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
వరంగల్ తూర్పు : ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
పశ్చిమ : మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, ఎస్.సుందర్‌రాజ్, నాగుర్ల వెంకన్న
వర్ధన్నపేట : మాజీ చైర్మన్లు కె.వాసుదేవరెడ్డి, సాంబారి సమ్మారావు