
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కథువాలో బుధవారం రాత్రి ఓ కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వాహనం రోడ్డుపై నుంచి మంగియార్ ప్రాంతంలోని 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
863399
