అవసరానికి డబ్బు ఆశ చూపి వడ్డీలు, చక్రవడ్డీల పేరిట అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు కొందరు వ్యాపారులు. వారికి ఫైనా న్స్ సంస్థలు కూడా తోడవడంతో ఈ దందా అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నది.
- మల్టీజోన్-1లో పోలీసుల విస్తృత సోదాలు
- భారీగా బంగారం, తాకట్టు పత్రాలు స్వాధీనం
- పలువురు వ్యాపారులపై కేసులు
హైదరాబాద్, ఏప్రిల్ 14(నమస్తే తెలంగా ణ): అవసరానికి డబ్బు ఆశ చూపి వడ్డీలు, చక్రవడ్డీల పేరిట అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు కొందరు వ్యాపారులు. వారికి ఫైనాన్స్ సంస్థలు కూడా తోడవడంతో ఈ దందా అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నది. దీంతో ఆ అప్పులు, వడ్డీలు చెల్లించలేక ఎంతో మంది బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి కేసులు మల్టీజోన్-1 పరిధిలో భారీగా నమోదుతుండటంతో ఐజీ ఏవీ రంగనాథ్ ఆ జోన్ పరిధిలోని ఎస్పీలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారుల ఇండ్లలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విస్తృతంగా సోదాలు చేపట్టారు.
ఈ సోదాల్లో భారీగా నగదు, బంగా రం, ప్రామిసరీ నోట్లు, ల్యాండ్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు, చెకులు, ఏటీఎం కార్డులు పట్టుబడటంతో వారిపై కేసులు నమోదు చేశారు. ఇకపై డబ్బుల కోసం వడ్డీ వ్యాపారులెవరైనా ఇబ్బందులకు గురిచేస్తే బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఐజీ సూచించారు. ప్రజలను పీడించే వడ్డీ వ్యాపారులను సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.