వనపర్తి జిల్లా: కొత్తకోట మండలం ముమ్మల్ పల్లి జాతీయ రహదారి NH44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెరుకు తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి టీఎస్‌ఆర్‌టీసీ గరుడ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ప్రయాణికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బస్సులో ఉన్న పలువురికి గాయాలు కాగా వారిని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొన్న బస్సు మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ గరుడ బస్సుగా గుర్తించారు. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఘటన జరిగిన సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరికొందరు గాయపడ్డారని అధికారులు మరియు పోలీసులు తెలిపారు.
