వనపర్తి : దేశంలోనే అతిపెద్ద వేరుశనగ మార్కెట్ వనపర్తి మార్కెట్ చైర్మన్ గా పలుస రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గా చినేటి బాలీశ్వర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా మార్కెట్ సభ్యులుగా పసుల బాలకిష్టయ్య, చీర్ల శ్రీనివాసులు, మహ్మద్ అబ్దుల్ లతీఫ్, చీపుర్ల శ్యామ్ సుందర్ రెడ్డి, నడిమింటి శివశంకర్, ముదావత్ శంకరమ్మ దవకాన సత్యనారాయణ, సబ్బిరెడ్డి యుగంధర్ రెడ్డి, సూగూరు యాదగిరి, గంధం పరమజ్యోతి, సాంబు శ్రీనివాసులు అల్, బండారు నాద్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు.దేశంలోనే అతిపెద్ద వేరుశనగ మార్కెట్ వనపర్తి మార్కెట్ అన్నారు. పాలమూరు పల్లికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. గత ఎనిమిదేళ్లుగా సాగునీరు రాక వేరుశనగ సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. వానాకాలం సీజన్‌లో వరి పొలాల్లో వేరుశనగ, యాసంజీ సాగుకు రైతులు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఇటీవల రూ.440 కోట్లతో వనపర్తి మార్కెట్ యార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
