విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ముంబైలోని జుహు జిల్లాలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇంతకీ ఆ అపార్ట్మెంట్ అద్దె ఎంతో తెలుసా… 2.76 లక్షలు. విరాట్ కోహ్లి దంపతులు గత నెల అక్టోబర్ 17న రిజిస్టర్ చేసుకున్నప్పుడు అపార్ట్ మెంట్ కోసం రూ.750,000 డిపాజిట్ కూడా చెల్లించినట్లు సమాచారం.
సముద్రాన్ని తలపించే విలాసవంతమైన అపార్ట్మెంట్ బరోడా రాజకుటుంబానికి చెందిన మాజీ క్రికెటర్ సమర్జిత్ సింగ్ గైక్వాడ్‌కు చెందినదిగా కనిపిస్తుంది. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబరులో మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఓ ఫామ్‌హౌస్‌ను వీరూష్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం.
