
అమరావతి: విశాఖ జిల్లా గొల్లల ఎండాడ గ్రామంలో విషాదం నెలకొంది. శనివారం ఉదయం ఇంటి నిర్మాణానికి గుంత తవ్వుతుండగా ఒక్కసారిగా గోడ కూలిపోయింది. అక్కడ పనిచేస్తున్న గోవింద్, తిరుపతి అనే ఇద్దరు కూలీలపై గోడ కూలిపోవడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
866665
