వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటంలో 20 రోజ్ వుడ్ దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు (సోమవారం) సిద్ధవటం మండలం పెద్దపల్లి పంచాయతీ రామస్వామి గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న ఒంటిమిట్ట, సిద్ధవటం పోలీసులు ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి 20 రోజ్‌వుడ్ దుంగలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుంగలను అక్రమంగా తరలించే వారిపై పీడీ బిల్లు వర్తిస్తుందని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు.
The post వైఎస్ఆర్ జిల్లాలో భారీ రోజ్ వుడ్ దుంగ సీజ్ appeared first on T News Telugu.
