Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

శాండ్‌విచ్‌.. జనరేషన్‌!

TelanganapressBy TelanganapressJanuary 27, 2024No Comments

Sandwitch

మూడు తరాలూ ఒకే ఇంట్లో నివసిస్తున్నాయి. ఒక తరానిది సంప్రదాయ వాదం. మరో తరానిది మధ్యే మార్గం. మూడో తరానిది ఆధునిక వాదం. పాతకొత్తల మధ్య నలిగిపోయే రెండోతరానికి ‘శాండ్‌విచ్‌ జనరేషన్‌’ అని పేరుపెట్టారు సైకాలజిస్టులు. పెద్దతరానికి మంకుపట్టు. కొత్తతరానికి ఉడుంపట్టు. వాళ్లను ఒప్పించలేరు. వీళ్లను మెప్పించలేరు. రైలుపట్టాల మధ్య రూపాయి బిళ్లలా, రెండు బ్రెడ్‌ ముక్కల మధ్య మసాలా పూరణంలా.. మానసికంగా నుజ్జునుజ్జు అవుతున్నది శాండ్‌విచ్‌ జనరేషన్‌.

ముత్తాత కట్టించిన ఇల్లు.. సంజీవరావు దంపతులకు దేవాలయం లాంటిదే. చిన్నపాటి పగుళ్లు వచ్చినా భరించలేరు. శ్రీనివాసరావు-పావని దృష్టిలో వారసత్వంగా వచ్చిన చల్లని నీడ అది. మూడోతరానికి మాత్రం హాట్‌ ప్రాపర్టీ. డెవలప్‌మెంట్‌కు ఇచ్చేస్తే.. కాసులు కురుస్తాయని ఆశ. దాంతో కియా కారు కొనొచ్చు, ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లొచ్చు. తండ్రి చచ్చినా అమ్మొద్దంటాడు. కొడుకేమో.. తాత చచ్చేలోపు అమ్మేస్తే లిటిగేషన్లు ఉండవని వాదిస్తాడు. మధ్యలో నలిగిపోయేది శాండ్‌విచ్‌ తరానికి చెందిన శ్రీనివాసరావే. అతనికి అమ్మడం ఇష్టం లేదు. అలా అని ఉన్నది ఉన్నట్టు ఉంచుకోడానికి సిద్ధంగా లేడు. రినొవేషన్‌ చేయిస్తే అదే పదివేలు అనుకుంటాడు.

సామాజిక.. ఆర్థిక.. రాజకీయ.. సాంస్కృతిక..

ఒకటా రెండా.. అనేకానేక అంతరాలు. ఆ ప్రభావాలు శ్రీనివాసరావును ఒకలా ఇబ్బందిపెడితే, పావనిని ఇంకోలా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సాధారణంగా పుట్టిన ఏడాదిని బట్టి ఎక్స్‌, వై, జెడ్‌.. తరాలుగా విభజిస్తారు. కానీ శాండ్‌విచ్‌ జనరేషన్‌ విషయానికి వచ్చేసరికి.. పైన ఓ తరం, కింద ఓ తరం.. మధ్యలో పచ్చడైపోయే తరాన్ని ఈ పేరుతో పిలుస్తారు మానసిక నిపుణులు. పెద్దల బాగోగులు, పిల్లల పోషణ.. రెండు బాధ్యతలూ వీరివే. ఒకటో తారీఖు వచ్చేసరికి సీనియర్‌ తరానికి మందులు కొనాలి, జూనియర్‌ తరానికి పాకెట్‌ మనీ సర్దాలి. వాళ్ల కాశీ యాత్రకు టికెట్లు బుక్‌ చేయాలి. వీళ్ల థాయ్‌లాండ్‌ ట్రిప్‌కు డబ్బులు సమకూర్చాలి. చలికాలం రాకముందే వాళ్లకు కొత్త స్వెటర్లు, వీళ్లకు బ్రాండ్‌ న్యూ హుడీస్‌ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయాల్సిందే.

వాళ్ల ఆసుపత్రి బిల్లులు, వీళ్ల స్కూలు-కాలేజీ ఫీజులు.. శాండ్‌విచ్‌ నాన్న ఖాతా నుంచే వెళ్తాయి. ఇక ఇల్లాలి కష్టాలు ఇల్లాలివి. మూడు తరాలు. మూడు అభిరుచులు. ఒకరికి పథ్యం భోజనం. ఒకరికి బీపీ, షుగర్‌ డైట్‌. ఒకరికి వెయిట్‌లాస్‌ సలాడ్స్‌. కోరినవారికి కోరిన భోజనం వండిపెట్టాల్సిన బాధ్యత శాండ్‌విచ్‌ తరం ఇల్లాలిదే. ఈ కుటుంబాల్లో మహిళ పాత్ర.. కత్తి మీద సామే. పెద్దల విషయంలో ఆమె ఎలా వ్యవహరిస్తుంది అనేది బంధువర్గమంతా గమనిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ పుట్టింటికి వచ్చే ఆడబిడ్డలకు సకల మర్యాదలూ చేసి, ఏ పట్టుచీరో పెట్టి పంపాల్సిన బాధ్యత ఆమెదే. ఆఫీసు, ఇల్లు.. అదనంగా బంధుగణ సేవ! ఇల్లు అద్దంలా ఉండాలని ఆరాటపడే అత్తమామలు, ఎక్కడి వస్తువులు అక్కడ పడేసే కూతుళ్లూ కొడుకులు.. మధ్యలో నరకయాతన
అనుభవించేది ఇల్లాలే.

ఇవీ లక్షణాలు..

శాండ్‌విచ్‌ జనరేషన్‌ వయసు.. కనీసం నలభైతో మొదలై.. అరవై పైచిలుకు ఉంటుంది. తల్లిదండ్రులతోపాటు అత్తమామల బాధ్యత మోస్తున్నవారూ లేకపోలేదు. మొత్తానికి పెద్ద బరువే. ఫలితంగా ఆర్థిక ఒత్తిళ్లూ ఎక్కువే. జీతం సరిపోకపోవచ్చు. పార్ట్‌టైమ్‌ జాబ్‌ అవసరం కావచ్చు. చిన్నాచితకా వ్యాపారాలు చేయాల్సిన పరిస్థితీ ఎదురుకావచ్చు. అంతేనా? యాభై ఏళ్లనాటికి సాధించాలనుకున్న ఆర్థిక లక్ష్యాల్ని అరవై నాటికి కూడా చేరుకోకపోవచ్చు. సొంతింటి కల కలగానే మిగిలిపోవచ్చు. ఫారిన్‌ ట్రిప్‌ అసాధ్యం కావచ్చు. వజ్రాల నెక్లెస్‌ చేయిస్తానని ఇల్లాలికిచ్చిన మాట.. అటకెక్కిపోవచ్చు. రిటైర్మెంట్‌ ఫండ్‌.. తరచూ ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతూ ఉండవచ్చు. మరోవైపు తోటివాళ్లంతా దూసుకుపోతూ ఉంటారు. రెండో ఇంటి గృహప్రవేశానికి ఇన్విటేషన్లు అందుతాయి. పొరుగింటి మీనాక్షమ్మ రవ్వలహారం చూసి శ్రీమతి భాగ్యశ్రీ నిప్పు రవ్వలా భగభగా మండిపోవచ్చు. వాలంటరీ రిటైర్మెంటు ఆలోచనల్ని పక్కనపెట్టి.. ఓ రెండేండ్లు ఎక్స్‌టెన్షన్‌ దొరికితే బావుండనే పరిస్థితికి వచ్చేస్తాడు శాండ్‌విచ్‌ తరం ప్రతినిధి.

హఠాత్తుగా..

కొందరు పెద్ద కొడుకు హోదాలో, పెద్ద కూతురు హోదాలో జన్మతః ‘శాండ్‌విచ్‌’ అవుతారు. మరికొందరు హఠాత్తుగా ఆ చట్రంలో ఇరుక్కుపోతారు. ఇలియాస్‌ భాయ్‌ పరిస్థితే తీసుకోండి. ఇంటికి చిన్న కొడుకు. పైన ఇద్దరు అన్నయ్యలు. భార్య వైపు నుంచి కూడా బాధ్యతలు లేవు. పిల్లలు ఇప్పుడిప్పుడే చేతికొస్తున్నారు. దీంతో బిందాస్‌గా బతికేవాడు. ఆర్థిక కష్టాలే లేవు. అంతలోనే పిడుగుపాటు లాంటి వార్త. పెద్దన్న అమెరికాలోని పిల్లల దగ్గరికి వెళ్తున్నట్టు సమాచారం అందింది. కాస్ట్‌ కటింగ్‌లో చిన్నన్న ఉద్యోగం పోయింది. డబుల్‌ బెడ్‌రూమ్‌ నుంచి సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌కు మారిపోయాడు. దీంతో తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్న ఇలియాస్‌ దగ్గరికి వచ్చేశారు. పిల్లల బెడ్‌రూమ్‌ పేరెంట్స్‌ రూమ్‌గా మారింది. నెలవారీ ఖర్చులు పెరిగాయి.

మందుల బడ్జెట్‌ అదనం. వారానికి ఓసారైనా ఫ్యామిలీ డాక్టర్‌కు కన్సల్టేషన్‌ ఫీజు సమర్పించుకోవాల్సిందే. అమ్మ వైపు చుట్టాలు, నాన్న వైపు బంధువుల రాకపోకలు పెరిగాయి. కాలింగ్‌బెల్‌ మోగిన ప్రతిసారీ గుండె గుబేలుమంటుంది. ఎవరొస్తారో, ఎన్నాళ్లు ఉంటారో, వెళ్తూ వెళ్తూ ఏం అడుగుతారో?.. అన్నీ ప్రశ్నలే. కుటుంబసభ్యులు ఓ చోట కూర్చుని మనసారా మాట్లాడుకుని ఎన్ని రోజులైందో! ఇల్లాలికైతే క్షణం తీరికలేదు. పనిమనిషి కూడా జీతం పెంచకపోతే కష్టమంటూ సంకేతాలు పంపుతున్నది. నోరులేని పాత వాషింగ్‌ మెషిన్‌ లోడ్‌ ఎక్కువై మొరాయిస్తున్నది. కొత్త గీజర్‌ అవసరాన్ని పిల్లలు నొక్కి చెబుతున్నారు. కరెంటు బిల్లు మూడురెట్లు పెరిగింది. నెలాఖరులో చేబదుళ్లు తప్పనిసరి అయిపోతున్నాయి. ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌కు మారాల్సిన అనివార్య పరిస్థితిలో చిక్కుకున్నాడు ఇలియాస్‌.

పెద్దల కష్టాలు..

కరోనా రాక్షసి మధ్యతరగతి జీవితాల్ని రాచి రంపాన పెట్టింది. ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. ఉద్యోగాలు ఎగిరిపోయాయి. ఖర్చులు పెరిగిపోయాయి. ప్రాణభయాలు అధికం అయ్యాయి. వయోధికుల ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. పల్లెలో అయినా సరే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం లేదు. పిల్లల తోడు అనివార్యమని భావిస్తున్నారు. ఇరుకిరుకు జీవితమని తెలిసినా పట్టణాలకు ప్రయాణం అవుతున్నారు. భారమవుతున్నామని తెలుస్తున్నా, కొడుకూకోడళ్ల మొహాల్లో రంగులు మారుతున్న దృశ్యం స్పష్టంగా కన్పిస్తున్నా.. గమనించనట్టే ఉంటున్నారు.

దిక్కులేని చావులు చూసిన చేదు అనుభవాలు ఆ ముసలి గుండెల్ని రాటుదేలేలా చేస్తున్నాయి. ‘కన్నాం. పెంచాం. చదువులు చెప్పించాం. ప్రయోజకుల్ని చేశాం. చివరి రోజుల్లో నాలుగు ముద్దలు వేయలేరా?’ అనే మొండిధైర్యం. నిజమే, వాళ్లకు మాత్రం ఈ కాంక్రీట్‌ జంగిల్‌ నచ్చుతుందా? ఈ ప్లాస్టిక్‌ పలకరింపులు ఇష్టం అవుతాయా? ఓ అనివార్యత నగరాల వైపు నడిపిస్తున్నది. ఆ మాటకొస్తే .. గ్రామాల్లోనూ శాండ్‌విచ్‌ జనరేషన్స్‌ చాలానే కనిపిస్తాయి. కాకపోతే, నగరాలతో పోలిస్తే.. మూడుతరాల మధ్య మరీ ఎక్కువ అగాధం ఉండదు. ఆస్తిపాస్తులు ఇంకా పెద్దల పేరు మీదనే ఉండటం దీనికి ఓ కారణం కావచ్చు.

పిల్లల గొణుగుడు..

అప్పటిదాకా ఆ ఇంట్లో పిల్లలదే రాజ్యం. ఏ బ్రాండ్‌ టీవీ కొనాలో వాళ్లే నిర్ణయించేవారు. ఏ మాడల్‌ రిఫ్రిజిరేటర్‌ ఆర్డరు చేయాలన్నదీ వాళ్లే తీర్మానించేవారు. బ్రేక్‌ఫాస్ట్‌ నుంచి డిన్నర్‌ వరకు మెనూకు ఆమోద ముద్ర వేసేదీ వాళ్లే. ఫ్రెండ్స్‌ కోసం ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. ఏ బర్త్‌డే పార్టీకో వెళ్లి అర్ధరాత్రి తిరిగొచ్చినా అమ్మ అడ్డు చెప్పదు. పాకెట్‌ మనీ కోసం డిమాండ్‌ చేయొచ్చు. అయినా, దిగిరాకపోతే అలిగి అన్నం మానేసి ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేయొచ్చు. ఇదంతా సీనియర్‌ తరం రంగప్రవేశం చేసేవరకే. ఆ తర్వాత సీన్‌ మారుతుంది. ఆలస్యంగా వస్తే ప్రశ్నిస్తారు. డ్రెస్సింగ్‌లో తేడా ఉంటే హెచ్చరిస్తారు. మొండికేస్తే మొహంవాచేలా తిడతారు. ‘మా రోజుల్లో అయితేనా?’ అంటూ ఫ్లాష్‌ బ్యాకులు వినిపిస్తారు. సెల్‌ఫోన్‌ కబుర్లు హద్దులు దాటినా.. చాటింగ్‌లో అర్ధరాత్రి గడిచిపోయినా పొద్దున్నే క్లాసు. ‘ఇదేం పెంపకం?’ అంటూ అమ్మానాన్నలకు వాయింపు. క్రమంగా పెద్ద తరానికి, చిన్న తరానికి మధ్య గొడవలు మొదలవుతాయి.

ఆధిపత్యపోరు అధికం అవుతుంది. ఎవరివైపు నిలబడాలో అర్థంకాక శాండ్‌విచ్‌ తరం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. అది అసాధ్యమని అర్థమైపోయాక.. మౌనాన్ని ఆశ్రయిస్తుంది. ‘నా కొడుకు మునుపట్లా లేడు’ అని కన్నీళ్లు పెట్టుకుంటారు పెద్దలు. ‘డాడీకి మేమంటే ఇష్టం లేదు’ అని ఏడుపు లంకించుకుంటారు పిల్లలు. కుటుంబం నిట్టనిలువునా చీలిపోతుంది. పిల్లలకేమో అమ్మానాన్నలతో కలిసి సినిమాకు వెళ్లాలనే కోరిక. ఆ నాన్న తన అమ్మానాన్నల్ని కూడా బయల్దేరమంటాడు. దీంతో పిల్లలు నిరాశకు గురవుతారు. నాన్న డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌, కూతురు కూచిపూడి నృత్య ప్రదర్శన ఒకే సమయంలో ఉన్నప్పుడు.. సహజంగానే డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో సీనియర్‌-జూనియర్‌ తరాల మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చాల్సిన బాధ్యత కూడా శాండ్‌విచ్‌ జనరేషన్‌దే.

ఒత్తిడి.. ఒత్తిడి

శాండ్‌విచ్‌ తరంలోని భార్యాభర్తలు ఇద్దరిలో తొలి దెబ్బ భర్తమీదే పడుతుంది. అనుకోని ఖర్చులు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. ఇలాంటి సమయంలో మూడు తరాలకూ మూడు ఆర్థిక ప్రణాళికలు అవసరమని సలహా ఇస్తారు పర్సనల్‌ ఫైనాన్స్‌ నిపుణులు. సీనియర్‌ జనరేషన్‌ను తీసుకుందాం. అప్పటికే వారికున్న స్థిరచరాస్తులను బేరీజు వేసి.. జీవితకాలానికి సరిపడా స్థిరాదాయాన్ని సమకూర్చే ఏర్పాట్లు చేయాలి. ఊళ్లో నిరుపయోగంగా ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టి.. ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయవచ్చు. నెలనెలా వడ్డీ డబ్బు చేతికొస్తే.. ఏ మందుల ఖర్చుకో పనికొస్తుంది. ఇల్లు, ఫ్లాట్‌ మొదలైనవాటి మీద బ్యాంకులు రివర్స్‌ మార్ట్‌గేజ్‌ రూపంలో రుణాలు ఇస్తున్నాయి. ఊళ్లో పొలానికి వచ్చే కౌలు డబ్బును అన్నదమ్ములు పంచేసుకోకుండా.. పెద్దలకే అందేలా ఓ ఒప్పందం చేసుకోవచ్చు.

పెద్దల ఖర్చుల విషయంలో తోబుట్టువుల సహకారం తీసుకోవచ్చు. ఎంతోకొంత బాధ్యత తీసుకునేలా ఒత్తిడి చేయవచ్చు. ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకోవడం ద్వారా.. పిల్లల ఫీజుల భారాన్ని దించుకోవచ్చు. దీనివల్ల పిల్లలకూ బాధ్యత తెలుస్తుంది. పాకెట్‌ మనీ విషయంలోనూ కచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిందే. పెరిగిన ఖర్చుల కారణంగా ఆ మొత్తానికి కోత విధిస్తున్నట్టు కరాఖండీగా చెప్పేయవచ్చు. వాళ్లూ అర్థం చేసుకోగలరు. అదే సమయంలో సొంత ఆర్థిక ప్రణాళిక కూడా అవసరమే. ఎమర్జెన్సీ ఫండ్‌, రిటైర్మెంట్‌ నిధి.. తదితర ఏర్పాట్లు చేసుకోవాలి. అంతేకానీ, శక్తికి మించిన అప్పులు చేయడం, ఆ అప్పులు తీర్చడానికి మరిన్ని అప్పులు చేయడం.. అంతిమంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడమే. శాండ్‌విచ్‌ జనరేషన్‌కు ఏ కష్టం వచ్చినా.. అది పాత, కొత్త తరాలు రెండిటిని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శాండ్‌విచ్‌ జనరేషన్లు పెరగడానికి ప్రధాన కారణం.. సుదీర్ఘ జీవన ప్రమాణాలు, ఆధునిక వైద్య విధానాలు’ అని విశ్లేషిస్తారు సైకాలజిస్టులు. కాబట్టే, ముప్పై అయిదు నుంచి యాభైనాలుగేండ్ల తరంలో నలభైశాతం మంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఆ ఒత్తిడికి కారణం చాలా సందర్భాల్లో కెరీర్‌ కాదు.. సాక్షాత్తు కుటుంబ బాధ్యతలే.

బ్యాలెన్స్‌ చేసుకోండి..

రెండు తరాల మధ్య సంధానకర్త బాధ్యత మనదే అయినప్పుడు, మరింత జాగ్రత్తగాఉండాలి. ఎవర్నీ నొప్పించకుండా వ్యవహరించాలి.

మాట్లాడండి..

అటు పెద్ద తరంతో, ఇటు చిన్న తరంతో తరచూ మాట్లాడండి. దీనివల్ల అపార్థాలు తొలగిపోతాయి.

గుర్తుంచుకోండి..

పుట్టినరోజులు, పెళ్లిరోజులు, తాతముత్తాతల పితృకార్యాలు మొదలైనవి గుర్తుంచుకోండి. అవసరమైతే గుర్తుచేయండి.

మనకోసమూ

ఎన్ని బాధ్యతలున్నా, ఎంత ఒత్తిడి మధ్య నలిగిపోతున్నా.. ఆలూమగలు ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకోవాలి.

సూటిగా

కొన్ని విషయాల్లో సూటిగా ఉండటమే మంచిది. మోయలేని భారాన్ని స్వీకరించవచ్చు. అప్పులు తీర్చడానికి మరిన్ని అప్పులు చేయొద్దు.

వివరించండి

కొత్తతరం అలవాట్ల గురించి పెద్దలకు వివరించండి. పెద్దల్ని చూసుకోవాల్సిన బాధ్యత గురించి పిల్లలకు బోధించండి. కొన్ని విషయాల్లో ప్రాధాన్యం తెలియకపోవడంవల్ల కూడా
అపార్థాలు తలెత్తుతాయి.

అంకెల్లో ఆమె శ్రమ

  • శాండ్‌విచ్‌ జనరేషన్‌లో భర్తకు రెట్టింపు ఒత్తిడిని ఆమె భరిస్తుంది. పదిరెట్ల పని ఎక్కువ చేస్తుంది. మిగిలిన మహిళలతో పోలిస్తే శాండ్‌విచ్‌ ఇల్లాలు..
  • రోజూ నాలుగు గంటల సమయం అదనంగా కుటుంబానికి కేటాయిస్తుంది.
  • ఆఫీసులో ఓ గంట తక్కువే పనిచేస్తుంది.
  • రెండు గంటల నిద్రను త్యాగం చేస్తుంది.
  • పదేళ్లు ముందుగానే అధికరక్తపోటు, మధుమేహం తదితర జీవనశైలి వ్యాధులు చుట్టుముడతాయి.
  • స్నేహితులూ తక్కువే. విందులు, వినోదాలకు హాజరు కూడా అంతంతమాత్రమే.
  • జీవితభాగస్వామితో గొడవలకు ఆస్కారం అధికం.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.