శ్రీకాకుళం జిల్లా అమదాలవలసలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి రోడ్డు పక్కనే వస్తున్న కార్మికులను లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన ఆమదాలవల-పాలకొండ రహదారిలోని మందాడ గ్రామ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతులు ముగ్గురిని మందాడ గ్రామస్తులుగా గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
The post శ్రీకాకుళం జిల్లాలో కూలీలను ఢీకొన్న ట్రక్కు ముగ్గురు మృతి appeared first on T News Telugu.
