Rajiv Gandhi Assassination: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ముగ్గురు శ్రీలంక వాసులు ఇవాళ తమ స్వదేశం చేరుకున్నారు. శ్రీలంక చేరుకున్న వారిలో మురుగన్ అలియాస్ శ్రీహరన్, జయకుమార్, రాబర్ట్ పయాస్ ఉన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో 2022 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఏడుగురు దోషుల్ని రిలీజ్ చేసింది.
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య(Rajiv Gandhi Assassination) కేసులో దోషులుగా ఉన్న ముగ్గురు శ్రీలంక వాసులు ఇవాళ తమ స్వదేశం చేరుకున్నారు. శ్రీలంక చేరుకున్న వారిలో మురుగన్ అలియాస్ శ్రీహరన్, జయకుమార్, రాబర్ట్ పయాస్ ఉన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో 2022 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఏడుగురు దోషుల్ని రిలీజ్ చేసింది. అయితే ఆ దోషులు రిలీజైన తర్వాత తిరుచిరాపల్లిలో ఉన్న ప్రత్యేక క్యాంపులో ఉన్నారు. అక్కడ నుంచి నిన్న చెన్నై చేరుకున్న వాళ్లు.. ఇవాళ లంక రాజధాని కొలంబోకు వెళ్లారు. డిపోర్టేషన్ ఆర్డర్ ఆదేశాలు వచ్చిన తర్వాత వాళ్లు స్వదేశానికి వెళ్తారని తమిళనాడు సర్కార్ ఇటీవల మద్రాసు హైకోర్టుకు వెల్లడించింది. చెన్నైలో ఉన్న శ్రీలంక హై కమీషన్.. ఆ ముగ్గురికీ ట్రావెల్ డాక్యుమెంట్లను అందజేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి శంతన్ ఇటీవల మృతిచెందాడు. ఈ కేసులో విముక్తి పొందిన భారతీయుల్లో పెరారివాలన్, రవిచంద్రన్, నళిని ఉన్నారు. ఈ ఏడుగురూ 30 ఏళ్ల జైలు జీవితం అనుభవించారు.
