
తిరుమల: ప్రముఖ సినీ నటి నమీషా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సాక్షాత్ ఏడుకొండల స్వామి చెంత రాజకీయాలపై ఆసక్తిని ప్రకటించారు. నటి నమీషా దంపతులు ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ తొలి విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఆలయ అధికారులు దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదపఠనం చేసి శ్రీవారి లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు.
దశానంతరం ఆలయం వెలుపల నమీషా మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు అందరినీ క్షేమంగా ఉంచాలని శ్రీవేంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. రాబోయే సినిమా గురించి మాట్లాడుతూ రాజకీయాలపై తనకున్న ఆసక్తిని ఆమె ప్రస్తావించారు.
818728
