Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తుల మొక్కులు, కానుకల రూపంలో రూ.4,38 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు భక్తులు హుండీలో వేసిన నగదును బుధవారం లెక్కించారు.
Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు భక్తుల మొక్కులు, కానుకల రూపంలో రూ.4,38 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు భక్తులు హుండీలో వేసిన నగదును బుధవారం లెక్కించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిపినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. మొత్తం 28 రోజుల్లో రూ.4,38,53,238 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. నగదుతో పాటు 133 గ్రాముల 300 మిల్లీ గ్రాముల బంగారం, 11 కేజీల 850 గ్రాముల వెండి వచ్చిందని పేర్కొన్నారు.
అలాగే 1751 అమెరికన్ డాలర్లు, 90 దక్షిణాఫ్రికా రాండ్స్, 14.25 కువైట్ దినార్స్, 15 ఓమన్ రియాల్స్, 450 యూఏఈ దిర్హామ్స్, 40 కెనడా డాలర్లు, 28 సింగపూర్ డాలర్లు, 100 ఆస్ట్రేలియా డాలర్లు, 10 యూరోస్, 5 ఖతార్ రియాల్స్ తదితర విదేశీ కరెన్సీని కూడా భక్తులు మొక్కులుగా సమర్పించారని ఈవో తెలిపారు.