హైదరాబాద్: సాబాద్‌లోని జగన్‌పహాడ్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై క్వాలిస్ వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్‌లోని పాతబస్తీ జహనుమా నుంచి శంషాబాద్‌కు క్వాలీస్ వాహనాల్లో కొందరు యువకులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కొందరు యువకులు కారులో హుక్కా తాగుతున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. యువకులు హుక్కా తాగడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.
