
హైదరాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాన్ బాస్కో స్కూల్ వద్ద బోరబండ రామారావు నగర్‌కు చెందిన రాజేశ్వర్ రెడ్డి (36) అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. రాజేశ్వర్ రెడ్డి సంచార కూరగాయల ట్రక్ డ్రైవర్.
దుండగులు జరిపిన కత్తి దాడిలో రాజేశ్వర్ రెడ్డికి తీవ్రగాయాలు కాగా గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు సనత్ నగర్ పోలీసులు తెలిపారు. అయితే, ఘటన జరిగిన ప్రదేశం, కేసు నమోదు, దాడి చేసిన వ్యక్తి ఎవరనే విషయంలో అస్పష్టతను తొలగించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.