సంత్ సేవాలాల్ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఇవాళ(ఆదివారం) బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ జీపీఆర్ కన్వెన్షన్ హాల్లో గుర్రంగూడ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరై.. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఆ తర్వాత మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి..మ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసింది. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కింది. మహేశ్వరం నియోజక వర్గంలో సేవాలాల్ మందిరానికి స్థలం కేటాయించాం. మహానీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.సేవాలాల్ చరిత్రను రేపటి తరాలకు తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
ఇది కూడా చదవండి: నోటీసులు రద్దు చేయండి.. 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదు
