రాష్ట్ర సచివాలయంలో విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం 11.40 దాటినా సచివాలయంలో ఎవరూ కనిపించడం లేదు. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి.నెమ్మదిగా 12గంటలకు ఉద్యోగులకు హాజరవుతున్నారు. ఇది మేము చెబుతున్న విషయం కాదు. సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలోని రెవెన్యూ ఉద్యోగుల పనితీరును పరిశీలించేందుకు మంత్రి గురువారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంకు వెళ్లగా ఖాళీ కుర్చీలు కనిపించడంతో సీరియస్ అయ్యారు.
ఖాళీ కుర్చీలను చూసిన మంత్రి హాజరు పట్టికలను పరిశీలించారు. అధికారులను ఆరా తీశారు. ఉద్యోగులు ఇంకా హాజరు కాలేదని తెలియడంతోపాటు కొందరు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆఫీసుకు రాకపోవడంతో మంత్రి సీరియస్ అయ్యారు. 11.40 గంటలకు కూడా ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడం బాధ్యతారాహిత్యమే అన్నారు. దీన్ని సహించేదిలేదని మంత్రి హెచ్చరించారు. విధులకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
ఇది కూడా చదవండి: తండ్రి సాయన్న ఆశయాలు నెరవేర్చకుండానే అనంతలోకాలకు..!!
