మేడారం సమ్మక్క సారలమ్మ జాతర శనివారంతో ముగిసింది. మూడురోజుల పాటు భక్తుల పూజలందుకున్న సమ్మక్క సారలమ్మ వన ప్రవేశంతో ఈ జాతర ఘనంగా ముగిసింది. వనం ప్రవేశంతో బుధవారం సారలమ్మ తర్వాత జాతర లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారం సమ్మక్కను గద్దెపైకి చేర్చారు. తల్లులు గద్దెలపై కొలువుదీరగా..అశేష భక్తజనం తరలివచ్చారు. మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పోటెత్తడంతో మేడారం జనజాతరను తలపించింది. భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలాచరించి బంగారం తులాభారం మొక్కులు సమర్పించుకున్నారు.
శనివారం ఇద్దరు తల్లులు సాయంత్రమే వన ప్రవేశం చేశారు. మేడారం గద్దెపై నుంచి చిలుకలగుట్టకు సమ్మకు చేరుకోవడంతో..కన్నెపల్లికి పూనుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు తిరిగి పయనమయ్యారు. వనదేవతలు గద్దెలను వీడుతున్న సమయంలో మేడారం స్వల్పంగా వర్షం కురిసింది. దీన్ని శుభసూచకంగా భావించిన భక్తులు ధ్యానాలు చేస్తూ గిరిజనదేవతలకు ఘనంగా వీడ్కోలు పలికారు. నాలుగు రోజుల పాటు కన్నులపండువగా ఈ మహాజాతర సాగింది. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క 7.27 గంటలకు వనప్రవేశం చేయడంతో ఈ మహాజాతర పరిసమాప్తమైంది.
ఇది కూడా చదవండి: మోదీపై జెమినీ అనుచిత సమాధానం..గూగుల్ ఏమందంటే?
