ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ తాగేవాళ్లు కూడా ఎంతో మంది ఉంటారు. కష్టపడకుండా..డబ్బులు సంపాదించేందుకు ఎన్నో ప్లాన్లు వేస్తుంటారు. తాజాగా యూపీలో జరిగిన సంఘటన వింటే మీరు షాక్ అవుతారు. యూపీసర్కార్ ప్రవేశపెట్టిన సీఎం సామూహిక వివాహ పథకంద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. ఆ మహిళ భర్త ఫిర్యాదుతో ఈ విషయం బయటకు రాగా..అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. ప్రభుత్వం ఇచ్చిన కానుకలన్నింటినీ అధికారులు వెనక్కి తీసేసుకున్నారు. మహారాజ్ గంజ్ జిల్లాల్లో జరిగిందీ ఘటన.
పూర్తి వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్ లో మార్చి 5వ తేదీన సీఎం సామూహిక వివాహ పథకం కింద 38 నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులకు ఘనంగా పెళ్లి జరిపించింది. అయితే ఆ రోజు ఓ యువతి పథకం ద్వారా వచ్చే సొమ్ము, కానుకల కోసం కక్కుర్తిపడింది. తన సోదరుడితో ఏడడుగులు వేసింది. ఆమెకు ఏడాది క్రితమే వివాహం జరిగింది. భర్త జీవనోపాధి కోసం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే సామూహిక వివాహం కింద తన భార్య మళ్లీ పెళ్లి చేసుకున్న విషయం అతడికి గ్రామస్థుల ద్వారా తెలిసింది. ఫొటోలు కూడా పంపించారు. దీంతో అతడు అసలు విషయం తెలుసుకోమని స్నేహితులను పంపించాడు. అనంతరం అధికారులకు జరిగిన విషయాన్ని తెలిపాడు. లక్ష్మీపూర్ అధికారులు దర్యాప్తు చేపట్టి ఆ మహిళ ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున అందించిన వస్తువులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.
కాగా సీఎం సామూహిక వివాహాల పథకం కింద వివాహం చేసుకున్న జంటలకు యూపీ సర్కార్ రూ. 51వేలు ఇస్తోంది. 35వేలు వధువు ఖాతాలో జమ చేస్తోంది. మరో 10వేలు బహుమతుల కోసం, 6వేలు వివాహ ఏర్పాట్ల కోసం ఇస్తుంది. వీటన్నింటితో పాటు మంగళసూత్ం, పెట్టె, బట్టలు కూడా అందిస్తుంది.
ఇది కూడా చదవండి: OTTలోనూ దూసుకుపోతున్న హనుమాన్..11గంటల్లోనే రికార్డులన్నీ బ్రేక్.!
The post సర్కార్ సొమ్ముకోసం కక్కుర్తి..అన్నాచెల్లెళ్లు ఏం చేశారో తెలుసా.? appeared first on tnewstelugu.com.
