“బజరంగీ భాయిజాన్” సల్మాన్ ఖాన్ కెరీర్లో మరపురాని చిత్రం. 2015లో విడుదలైన సల్మాన్ కుటుంబ కథా చిత్రంగా భారీ విజయాన్ని అందుకుంది. కబీర్ ఖాన్ దర్శకుడు. ఈ చిత్రానికి సీక్వెల్ సిద్ధమవుతోంది.

“బజరంగీ భాయిజాన్” సల్మాన్ ఖాన్ కెరీర్లో మరపురాని చిత్రం. 2015లో విడుదలైన సల్మాన్ కుటుంబ కథా చిత్రంగా భారీ విజయాన్ని అందుకుంది. కబీర్ ఖాన్ దర్శకుడు. ఈ చిత్రానికి సీక్వెల్ సిద్ధమవుతోంది. ఈ సీక్వెల్‌కి గతంలో “పవన్ పుత్ర” అనే టైటిల్‌ను ప్రకటించారు.
ఈ సినిమాతో సల్మాన్ ఖాన్‌తో పాటు నటి కరీనా కపూర్ కూడా పేరు తెచ్చుకోనుంది. అయితే సీక్వెల్లో కరీనా కపూర్‌కు బదులుగా పూజా హెగ్డేను హీరోయిన్గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తొలి సినిమాలో కరీనా కపూర్ పాత్రలో పూజా నటిస్తుంది. పూజా హెగ్డే ప్రస్తుతం సల్మాన్‌తో కలిసి “కిసీ కా భాయ్ కిసీ కి జాన్” చిత్రంలో నటిస్తోంది.
