
హైదరాబాద్: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాయంత్రం 5 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలవనున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే సమావేశంలో ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు కూడా పాల్గొంటారు. తెలంగాణ యూనివర్సిటీ జాయింట్ అపాయింట్‌మెంట్ కమిటీపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అనుమానాలను సబితా ఇంద్రారెడ్డి నివృత్తి చేయనున్నారు. జాయింట్ యూనివర్శిటీ అపాయింట్ మెంట్స్ కమిటీతో న్యాయపరమైన అంశాలన్నింటినీ గవర్నర్ కు వివరిస్తామని చెప్పారు.
