సీసీసీలోని సింగరేణి ఎస్‌సీవోఏ క్లబ్‌లో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కే-7గని అధికారులు, మైనింగ్ స్టాఫ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా సాగింది. 1976 నుంచి మార్చి-2024 వరకు రిటైర్డ్ అయిన గని అధికారులు, మైనింగ్ స్టాఫ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సీసీసీ నస్పూర్, మార్చి 3: సీసీసీలోని సింగరేణి ఎస్‌సీవోఏ క్లబ్‌లో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కే-7గని అధికారులు, మైనింగ్ స్టాఫ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా సాగింది. 1976 నుంచి మార్చి-2024 వరకు రిటైర్డ్ అయిన గని అధికారులు, మైనింగ్ స్టాఫ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయిన అధికారులు, ఉద్యోగులు ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
అనంతరం రిటైర్డ్ సింగరేణి డైరెక్టర్ భాస్కర్‌రావు ఆర్‌కే-7గనిలో పనిచేసిన అనుభూతులు, అనుభవాలను గుర్తుచేశారు. సింగరేణిలోనే అతిపెద్ద భూగర్బ గని ఆర్‌కే-7 అని.. ఇందులో పనిచేసిన అధికారులందరూ ఉన్నత స్థానంలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామగుండం రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్, రిటైర్డ్ సీజీఎం బానోత్ చంద్రు, రిటైర్డ్ జీఎంలు రాంరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, వీరస్వామి, రిటైర్డ్ డీజీఎం ఆర్‌సీబీ రాజ్, ఆర్‌కే-7 గ్రూప్ ఏజెంట్ రాముడు, క్వాలిటీ మేనేజర్ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
