
కొల్లాపూర్, జనవరి 7: మండలం సింగవట్నంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నాగార్జున దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఓరుగంటి సం పత్‌కుమార్‌శర్మ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
జడ్జి దంపతులకు తహశీల్దార్ రమేష్, ఎస్సై బివి రమణ యాదవ్ పుష్పగుచ్ఛాలు అందించారు. నాగర్ కర్నూల్ డీఎస్పీ మోహన్ బాబు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.
