సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి.

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. 100 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సర్రీ హిల్స్‌లోని ఓ భవనంలోని ఏడో అంతస్తులో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. ఇవి పక్క భవనాలకు కూడా వ్యాపించాయి. మంటల తీవ్రతకు చుట్టుపక్కల దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 100 అగ్నిమాపక సిబ్బంది, 20 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. మంటలు చెలరేగడంతో భవనం పూర్తిగా దగ్ధమైపోయిందని అధికారులు తెలిపారు. అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నందున ప్రజలు ఆ ప్రాంతంలోకి రావద్దని అధికారులు తెలిపారు.
కూడా చదవండి..
కేరళ రాష్ట్ర లాటరీ |కేరళ రాష్ట్ర లాటరీ డ్రా…తెలియని వ్యక్తి రూ.1.2 కోట్లు గెలుచుకున్నాడు
కేన్స్ 2023 | కేన్స్‌లో మెరిసిన సన్నీ, అదితి, శృతి.ఫోటో వైరల్ అవుతుంది
భారత్‌లో కరోనా | మళ్లీ 500కి పైగా కొత్త కేసులు.. ఐదుగురు మృతి
