హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన పానిపట్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతులు అబ్దుల్ కరీం, అఫ్రోజా, ఇష్రత్ ఖతుమ్, రేష్మా, అబ్దుల్ షకూర్, అఫాన్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా బంగ్లాదేశ్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఉదయం వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయినట్లు గుర్తించారు. పోలీసులు కేసు తెరిచి దర్యాప్తు చేపట్టారు.
The post సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి appeared first on T News Telugu.
