సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి 950 మంది షార్ట్‌లిస్ట్‌ను తెలంగాణ ఆరోగ్య శాఖ ఈరోజు (సోమవారం) విడుదల చేసింది. ఇందులో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 734, వైద్యవిధాన పరిషత్‌లో 209, ఐపీఎంలో 7 పోస్టులు భర్తీ అయ్యాయి.
హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ ఏడాది జూన్‌లో 969 స్థానాలకు పిలుపునిచ్చింది. దీనికి 4,803 దరఖాస్తులు వచ్చాయి. గత నెలలో వైద్యారోగ్యశాఖ ధ్రువపత్రాల గుర్తింపు, పరిశీలన పూర్తి చేసింది. దీని ఆధారంగా 950 స్థానాలకు షార్ట్‌లిస్ట్‌ను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులను ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియామక ప్రక్రియ పారదర్శకంగా, సులువుగా జరిగిందని ట్వీట్ చేశారు.
