రాష్ట్ర శాసన సభలో కరెంటుపై పెద్ద మగాళ్ల లెక్క ఉపన్యాసాలు ఇచ్చారని..కరెంటు కోసం అప్పులు చేశామని చెప్పారు.. ఎవరి కోసం అప్పులు చేశామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. అప్పు చేసి కరెంటు కొన్నది రైతుల కోసమే కదా అని స్పష్టం చేశారు. ఆదివారం పలు జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు “ ఆనాడు నేను గంట సేపు అసెంబ్లీలో ఉపన్యాసం చెప్పిన. పీక్ అవర్స్ వచ్చినప్పుడు రెండు మూడు నెలల పాటు నెలకు రూ.14 వందల కోట్లు పెట్టి ఎంత షార్టేజ్ ఉంటే అంత కొనుక్కొచ్చి ఇచ్చాం. అందుకే ఆనాడు రెప్పపాటు సమయం కూడా కరెంటు పోలేదు. మేము ఉన్నప్పుడు పీక్‌లోడ్ 14,900 మెగావాట్ల పైచిలుకు పోయింది. మొన్న పీక్‌లోడ్ 15,600 మెగావాట్లకు పోయింది.
ఓ 5వందలు పెరిగిందంతే. అది కూడా మీరు కొనడం లేదు. కొంత కొంటున్నా, రైతులకు అవసరమైన మేర విద్యుత్ కొనడం లేదు. కాబట్టే కరెంటు రావడం లేదు. మొన్నటి వరకు దర్జాగా ఉన్న మోటార్లు ఇప్పుడెందుకు కాలుతున్నయ్ అంటూ ప్రశ్నించారు. ఒక రోజులో ఐదారుసార్లు కరెంటు వస్తూ పోవడం వల్లనే మోటార్లు కాలుతున్నాయి. అక్కడక్కడ మావోళ్లు సభలల్లో మాట్లాడుతున్నా కరెంటు పోతున్నది చూస్తున్నాం. జగదీశ్‌రెడ్డి నల్లగొండ సభల్లో మాట్లాడుతుంటే ఐదుసార్లు కరెంటు పోయింది. కరెంటు పోయినప్పుడల్లా కింద కూర్చునోళ్లు ‘జై కాంగ్రెస్’ అని హేళన చేస్తున్నరు. అయినా మీకు చీమ కుట్టినట్టు లేదు బాధలేదంటూ ఎద్దేవా చేశారు కేసీఆర్.
7ఏళ్లుగా బ్రహ్మాండంగా నడిచిన కరెంట్ సిస్టం మూడు నెలల్లోనే నడవకుండా పోయిందంటే ఇది ఎవరి అసమర్ధతతో మీరే చెప్పాలన్నారు. ఇది నూటికి నూరు శాతం అసమర్థ అని ఫైర్ అయ్యారు కేసీఆర్. అవివేక, తెలివితక్కువ కాంగ్రెస్ పార్టీ అసమర్ధత వల్ల మాత్రమే ఇలా జరుగుతుందన్నారు. మేము ఆనాడు పవర్ సిస్టంలో మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లను తొలగించి టెక్నోక్రాట్స్‌ను పెట్టి నడిపామాని… మాకు తెలివిలేక కాదని… ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో నూటికి నూరు శాతం టెక్నోక్రాట్స్‌నే నియమించామని… ఎలా నడపాలో వారికి తెలుసు కాబట్టి అప్పుడు సమర్థవంతంగా నడిచిందని పేర్కొన్నారు. ఇప్పుడు అందరు ఐఏఎస్ ఆఫీసర్లను తెచ్చిపెట్టినా… వాళ్లకు పట్టదు. మంత్రులకు పట్టదు. వాళ్లకు రాజకీయాల కోసం తీరికలు ఉన్నాయి కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవంటూ మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: ప్రజాక్షేత్రంలోకి బీఆర్ఎస్ అధినేత..రైతులను కలవనున్న గులాబీ బాస్.!
The post సీఎం రేవంత్ ఇజ్జత్ తీసిన గులాబీ బాస్..! appeared first on tnewstelugu.com.