లోకసభ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో శ్రీరామ నవమి, భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాల సమర్పణకు, కల్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ నిరాకరించింది. ఒకవేళ తాము విధించిన ఆంక్షలు ఎవరైనా ఉల్లంఘించి లైవ్ ఇచ్చినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు అయోథ్య రామమందిరంలో ప్రత్యక్షప్రసారం ఇవ్వడానికి ఈసీ ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహారిస్తుందంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. మోదీ కన్నుసన్నల్లో ఈసీ పనిచేస్తోందంటూ మండిపడుతున్నారు.
శ్రీరామ నవమి – భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారికి సీఎం @revanth_anumula పట్టువస్త్రాల సమర్పణకు, కళ్యాణ మహోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి ఎలక్షన్ కమిషన్ నిరాకరణ. అయోధ్యలో జరిగే కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారానికి మాత్రం అభ్యంతరంలేదని #BJP ట్వీట్‌ను బట్టి తెలుస్తోంది. pic.twitter.com/Y5G1moz0zJ
— Ayodhya Reddy Boreddy (@ayodhya_boreddy) April 16, 2024
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ అధినేత సంచలన వ్యాఖ్యలు..!